info.manatemples@mail.com

+91 9866933582

అనంత పద్మనాభ స్వామి దేవాలయం -అనంతగిరి


భాగ్యనగరానికి సుమారు 85 కి మీ దూరంలో వికారాబాద్ పట్టణానికి 6 కి మీ దూరం లో దట్టమైన కొండలు,అడవుల మద్య అనంతగిరి గుట్టపైన వెలిసిన అద్బుత వైష్ణవ క్షేత్రం అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం. 600 సంవత్సరాల క్రితం నవాబుల ఈ గుడి కట్టించారని చారత్రిక ఆదారాలు చెప్తున్నయి.


ముచుకున్దుడు అనే రాజర్షి రాక్షసులతో యుద్దాలు చేసి గెలిచి తన అలసట తీర్చుకోడానికి భూలోకం లో ఏదైనా మంచి ప్రదేశాన్ని చూపించమని స్వర్గాలోకదిపతి ఆయన ఇంద్రుణ్ణి కోరాడని కథనమ్.తన నిద్ర బంగం చేసిన వారిని తన తీక్షణమైన చూపులతో బసమైపొవునత్లు వారలు ఇవ్వమని కోరారు. దేవేంద్రుని సూచనా మేరకు ముచుకుందుడు అనంతగిరి క్షేత్రం వచ్చి ఒక గుహ లో నిద్రపోయినట్లు కథనం .


ద్వాపరయుగం లో కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారకనగారాన్ని ముట్టడించి యడవ సైన్యాన్ని నాశనం చేశాను. శ్రీ కృష్ణ బలరాములు ఇద్దరు కలయవనుడికి బయపదినట్లు నటిస్తూ ముచుకున్దుడు సేదతీర్తున్న అనంతగిరి క్షేత్రానికి వచ్చేల పరుగు తీసారు. కృష్ణ భగవానుడు తన పైన వున్నా వస్త్రాలు తీసి నిద్రిస్తున్న ముచుకున్దిని పైన కప్పెను. కాలయవనుడు నిద్రిస్తున్న ముచుకున్డున్ని చూసి శ్రీ కృష్ణుడు అనుకోని నిద్ర బంగం చేస్తాడు దానికి ఆగరహించిన ముచుకున్దుడు కలయవనుని బస్మం చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు ప్రత్యక్షం కాగ ముచుకుంన్ధుడు చాల సంతోషించి వారి పాదాలు కడిగి జీవితం ధన్యం చేసుకున్నాడు అని విష్ణు పురాణం చెబుతుంది . శ్రీ కృష్ణని పాదాలు కడిగిన జలమే జివానది అయినది అని అదే కలియుగం లో ముచుకుందా నది ( ముసినది గ ప్రసిద్ది చెందినది ). కలియుగ ప్రారంబం లో మహా విష్ణువు మార్కండేయ మహాముని కి దర్శనం ఇచ్చి అతని తప: పలముగా సాలగ్రామ రూపం లో అనంత పద్మనబుడిగా అవతరించారు అని చరిథ్ర.




అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రక్కనే బవనాషిని అని పిలిచే భాగిరథ గుండం ఉంది దాంట్లో స్నానం ఆచరించిన అయురరరోగ్యాలు,సంతానం,కోరికలు నేరవేరుతయిని భక్తుల నమ్మకం!! దేవాలయ పరిసర ప్రాంతాల్లో సుమారు 100 వరకు గుహలు ఉన్నాయి .పుర్వమ్ ఋషులు ఇక్కడ తపస్సు చేసుకున్నారు అనడానికి అవే అ ఆదారాలు !!

వెళ్ళే మార్గం : హైదరాబాద్ -తాండూర్ ( వికారాబాద్ దాటగానే అనంతగిరి వస్తుంది ) హైదరాబాద్ -వికారాబాద్ ( వికారాబాద్ నుండి ఆటోలు,బస్సు లు ఉంటాయి